Vemuri Visveswara Rao, every one know this name in my native place. People know him as a teacher, good talker, good organiser, good speaker and many with many shades. He is none other than my Father.
He retired from his service today. Along with everyone i also surprise he is retiring today???? reason behind is, he never think that he became old and even today he is not interested to sit idle. He is great father, he is good friend and he is Guide for me.
I am happy that he completed his service without any remarks though he is actively participated in politics from back end. I am happy he achieved lot of achievements may be no one can beat that in near future like continues 4 times winners in district volley ball captain, whatever the school he works especially the section in which he teach created records in almost every year results.
Hope no one forget his services on the school wherever he worked. He always says "My house doors are always open for the good purpose", i hate to do some thing bad to anyone. Give shake hand to the fellow you hate or the fellows who hate you"
He is the man who achieved a lot and never accepted any awards that offered many time. Even he is not interested to do his retirement function...
All the Best Dad, Hope you continue with same spirit with good health & wealth. Go on and on...
Monday, May 31, 2010
Friday, May 21, 2010
మొన్న ఫేస్‌బుక్.. నిన్న యూట్యూబ్.. నేడు ట్విట్టర్
మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన క్యారీకేచర్‌లు ప్రచురించినందుకు మొన్న.. ఫేస్‌బుక్, నిన్న.. యూ ట్యూబ్‌లపై నిషేధం విధించిన పాకిస్థాన్ సర్కారు నేడు (శుక్రవారం) ట్విట్టర్‌పై నిషేధిం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ వెల్లడించింది. ఈ శాఖ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థలు ట్విట్టర్ సైట్‌ను బ్లాక్ చేశాయి. దీంతో పాకిస్థాన్ నెటిజన్లు యాక్సెస్ చేయలేక పోతున్నారు. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన నెటిజన్లు ట్విట్టర్ బ్లాగును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, ఈ 'సైటు నిషేధించబడింది' అనే సమాచారాన్ని వారు పొందుతున్నారు.
మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన సమాచారాన్ని, క్యారీకేచర్లను పొందుపరిచారంటూ గత రెండు రోజులుగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌తో పాటు.. వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూ ట్యూబ్‌లపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెల్సిందే. లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ ఈ తరహా చర్యలు చేపట్టింది.
దీనిపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ అథారీటీ అధికారులు స్పందిస్తూ.. అభ్యంతకర వీడియోలు, సమాచారం ఉండటంతో యూట్యూబ్‌ను నిషేధించినట్టు చెప్పారు. అయితే, ఎలాంటి సమాచారాన్ని పొందుపరిచిందో శాఖ వెల్లడించలేదు. ఇపుడు తాజాగా ట్విట్టర్‌పై కూడా ఇదే తరహా చర్య చేపట్టింది. అయితే, ఈ చర్యకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదన్నారు.

Sunday, March 14, 2010
Nation vs regionalism
NDTV debates whether Andhra Pradesh can return from the brink of chaos, and ask whether small states are bad for a strong nation.
http://www.nyootv.com/watch/Entertainment/Nation-vs-regionalism/2799-0-16

Thursday, March 11, 2010
హైదరా"భాగో".. వై"జాగో": విశాఖలో విశాల అవకాశాలు!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతోంది. ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ నగరంపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరానికి ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా ఒకపుడు ఎంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన భాగ్యనగరం.. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనలో అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం పొంచివుంది.
అదేసమయంలో ఓడరేవు నగరంగా పేరుగాంచిన విశాఖపట్టణం ఇకపై రాష్ట్ర ఐటీ హబ్‌గా అవతరించనుంది. ఇది సీమాంధ్ర ప్రాంత యువతీ యువకులకే కాకుండా తెలంగాణ ప్రాంత యువకులకు కూడా ఓ శుభవార్తలాంటిందే. మాఫోయ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజాగా సర్వేలో ఈ హైదరాబాద్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించింది.ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు ఈ సర్వే తేల్చింది. అదేసమయంలో అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ విశాఖ నగరంపై దృష్టి సారించినట్టు పేర్కొంది. దీన్ని నిజం చేసేలా ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం వైజాగ్‌లో "గ్లోబెల్ సెంటర్"ను నెలకొల్పే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, రవాణా, తదితర అంశాలపై ఐబీఎంకు చెందిన 12 మంది నిపుణుల కమిటీ వైజాగ్‌లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తోంది. ఈ బృందం ఆంధ్రా వర్శిటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో కూడా సమావేశమై సమీక్ష నిర్వహిస్తుంది. పైపెచ్చు.. హైదరాబాద్‌తో పోల్చితే వైజాగ్‌లో ఉద్యోగస్తులను తక్కువ జీత భత్యాలకు ఎంపిక చేసుకోవచ్చనే భావన ఐటీ కంపెనీలకు ఏర్పడింది. దీంతో ఐబీఎం గ్లోబెల్ సెంటర్ ఏర్పాటుకు ఎక్కువగా మొగ్గు చూపుతోంది.
దీనికి తోడు.. ఇట్టే ఆకర్షించే సముద్ర తీర ప్రాంతం, కనువిందు చేసే రిషికొండలు, అరకు వంటి పర్యాటక ప్రాంతాలు వైజాగ్‌కు మరింత పర్యాటకట శోభను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకపోవడం అంతర్జాతీయ కంపెనీలను ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే, భాగ్యనగరం కంటే వైజాగ్ ఎంతో ప్రశాంతమైన నగరంగా పేరుగడించింది. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన దాఖలాలు లేవు. అదే హైదరాబాద్ విషయానికి వస్తే హిందు-ముస్లిం అల్లర్లు, తెలంగాణ ఉద్యమం, గూండాయిజం, భూకబ్జా ఇలా అనేక సమస్యల ఉన్నాయి. అలాగే వైజాగ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువ. పైపెచ్చు భూముల ధరలు కూడా చౌకే. ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో వందలాది ఎకరాలు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. ఒక్క రిషి కొండలోనే 20 సెజ్ కంపెనీలు అనుమతి పొందగా, వీటిలో 12 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యాశాతంతో పోల్చితే హైదరాబాద్ కంటే వైజాగ్ ప్రజలు ఎక్కువ విద్యావంతులు కావడం గమనార్హం.
ఇదిలావుండగా, వచ్చే మూడేళ్ళలో దేశ వ్యాప్తంగా పది లక్షల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 20 నుంచి 25 వేల ఉద్యోగాలు ఒక్క వైజాగ్ నగరంలో అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెరాస అధినేత కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమం పుణ్యమాని హైదరాబాద్ నగరం తన శోభను కోల్పోతుండగా, వైజాగ్‌లో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Sunday, February 14, 2010
Wednesday, February 3, 2010
ఛానళ్ల "క్రియేటివ్" న్యూస్ స్టోరీస్...
నేటి ఎలక్ట్రానిక్ మీడియాపై మనకే నవ్వు వస్తుంది. మరికొందరికి ఎంతగా దిగజారిపోయామో అనిపిస్తుంది. ఇంకా స్వాతంత్ర్యసమరయోధులకైతే.. హతవిధీ... ఎంతగా విలువలు పడిపోయాయో అనిపిస్తుంది. ఇది ఒకరోజు కాదు. రెండు రోజులు కాదు.. ఎన్నో రోజులుగా ప్రజల మనస్సులతో ఆడుకుంటున్న ఛానళ్ల వ్యవస్థకు దర్పణం.
చాలా సినిమాల్లో మీడియాపై రకరకాల సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అవన్నీ హాస్యం కోసమే అన్నట్లు చోద్యం చూస్తూనే ఉన్నారు. కానీ ఛానళ్ల తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది..? దీనికి బాధ్యులెవరు? అనేదానికి ప్రభుత్వ యంత్రాంగమే సమాధానం చెప్పాలి.
దేశంలో ఎక్కడా లేనటువంటి ఛానళ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్నా వాటికి పర్మిషన్లు ఇచ్చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పర్మిషన్‌కోసం పైరవీలు... కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు వేలాది జీతాలు పెంచేస్తున్నారు. క్రియేటివ్ హెడ్ జీతమైతే లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఆ మధ్య ఓ ఛానల్‌లో అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్ పోస్ట్ వేసి దానికి మరో లక్ష అదనంగా ఇవ్వడం ప్రారంభించారు. ఆ క్రియేషన్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
ప్రధానంగా సినిమా వార్తలో బాలీవుడ్, టాలీవుడ్ న్యూస్‌తో పాటు గాసిప్స్ కూడా ప్రారంభించారు. అందులో మార్నింగ్ ఫోటోలు పెట్టేసి.. ఫలానా తార ఫలానా వారితో ఇలా తిరిగింది... డాన్స్ చేసింది... అనేది సారాంశం. ఇలా ఒక్కటి కాదు... రోజూ రాత్రిపూట ఒక్కో ఛానల్‌ది ఒక్కో శైలి. ఇలియానా గోవా బీచ్‌కు వెళితే.. అంతకుముందు నటించిన దేవదాసులోని ఎక్స్‌పోజింగ్ సీన్స్ చూపించి ఇంతగా అక్కడి జనాలను ఆహ్లాదపరుస్తోందంటూ... కథనాలు చెప్పడం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని.
అసలు మీడియా అనేది ఎలా ఉండాలి. ఎలాంటివి ప్రసారం చేయాలి..? దానికి పరిమితులు ఏమిటి..? అనేవి తెలీని వారు కూడా జర్నలిజంలో రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు జర్నలిజం అంటే గౌరవప్రదంగా భావించేవారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ప్రభుత్వం ఒక సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. కాలక్రమేణా విలువలు దిగజారుతున్నాయి. ఏది నిజం.. ఏది అసత్యం.. అనేది ఆలోచించకుండా పోటీ తత్త్వంతో ముందుకు సాగుతున్నాయి. వేసిన వార్తనే వేస్తూ.. కాస్త బ్రేక్ ఇస్తూ.. నిరంతరం చూస్తూనే ఉండండి... అంటూ వీక్షకుల మనస్సు మరల్చకుండా చేస్తున్నాయి. దీనికి వీక్షకుడు బానిస అవుతున్నాడు.
ప్రయోజనం లేని వార్త అయినా మనమెందుకు చూడాలి... మన పనులను మానుకుని చూడాలా..? అని ఆలోచించే దశను దాటిపోయారు. ఈ ప్రభావం బంధుమిత్రుల ఆప్యాయత అనురాగాలపై కూడా పడుతోంది. చుట్టం చూపుగా ఎవరైనా వస్తే... టీవీ చూస్తూనే ఉంటారు. ఏదో మిస్సయినట్లుగా దాన్నే చూస్తూ.. ఏదో గుడ్డిగా పలుకరించే దుస్థితికి మానవుడు వచ్చేశాడు.

టీవీ వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఎలాగా...? మంచి విజ్ఞాన కార్యక్రమాలు ప్రదర్శిస్తే.. అవి తగ్గిపోయి అజ్ఞానాన్ని, ఊహాజనితమైన వాటిని ప్రదర్శిస్తూ... కోట్లు గడిస్తున్న ఆయా యాజమాన్యాలు ప్రజలను నిస్సహాయులుగా చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా రాజ్యమేలుతున్న దశలో స్వాతంత్ర్య పోరాటాలు ఆ మరుసటి నాడే ప్రపంచానికి తెలిసేవి. రేడియోలు ఉండేవి. అవి వినడానికి గ్రంధాలయాలకు వెళ్లి మరీ వినివచ్చేవారు. కాలక్రమేణా మార్పులతో విజ్ఞానం మారి అరచేతిలోకి వచ్చేసింది. దీన్ని వ్యాపారం చేసే యాజమాన్యం రకరకాలుగా ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తోంది.
ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే.. తెలంగాణా, సమైక్యాంధ్ర పోరాటాల్లో... చిన్నపాటి సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వారికి వారికి మధ్య చర్చపెట్టి చిచ్చు రేపుతున్నాయి. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లుంది... వైఎస్ మృతిపై అనుమానం ఉందని ఏదో రష్యా వెబ్‌సైట్ రాస్తే... దాన్ని ప్రధానంగా చూపి రాష్ట్రంలో అలజడులు సృష్టించాయి కొన్ని ఛానళ్లు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేకంటే... ఇలాంటివి ప్రసారం చేసిన ఛానళ్లపై కఠిన వైఖరి ప్రదర్శించాలి.
దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే... దాన్ని వెలికి తెచ్చి ప్రజలకు చెప్పామని తృప్తిపడి రేటింగ్ పెరిగిందనే సంస్కృతి ఉండేది. కానీ నేడు లేనిది కూడా ఉన్నట్లుగా ఏదో ఒక సంఘటన సృష్టించి దాన్ని వెలుగులోకి తెచ్చామని భుజాలు చరచుకోవడం ఎక్కువైంది. ఆ మధ్య ఓ టీవీ చానల్ ఓ చిత్రమైన షో ఏర్పాటు చేస్తే... అందులో ఒక యువకుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాటను పాడాడు. ఆ యువకుడు ఉన్నత కుటుంబంలోని ఓ అమ్మాయిని ప్రేమించి ప్రేమలో విఫలమై ఆ పాటను రాసుకున్నాడని... ఆ పాటను పదే పదే ప్రసారం చేయడం... ఆ తర్వాత దాన్ని చూసిన ఓ నటుడు ఎకాఎకిన రాష్ట్రరాజధానికి వచ్చి సినిమా తీస్తానని ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి చెప్పడం.. చూసి మిగిలిన జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఓ సీరియలే రాయవచ్చు. ఛానళ్లు అనేవి విదేశాలను అనుకరించినవే... విదేశీ ఛానళ్లు ఏం ప్రోగ్రాములు చేస్తే వాటిని కాపీ చేసి మనవాళ్లు క్రియేటివ్ అని పేరు వేసుకుని చేస్తుంటారు. దాన్నే మరో ఛానల్ పేరు మార్చి ఉపయోగించుకుంటుంది. కానీ విదేశాల్లో ఇంతగా దిగజారే విలువలు లేవని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు.
రిలయన్స్ ఘటనతో అంతా ఎలర్ట్ అయ్యారు. వాస్తవాలు ఏమైనా.. ప్రతి పార్టీకి చెందిన నాయకుడు స్పందించాడు. ఛానళ్లకు నియంత్రణ ఉండాలని. మరి వారు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ.. ప్రచారానికి ఉపయోగించుకున్నంతవరకూ బాగానే ఉంది వ్యవహారం. అంతా అయిపోయాక, వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేనికైనా టైమ్ రావాలంటారు. ఒక్కోసారి ఒక్కో ఛానల్‌లో ప్రసారాలు చూస్తుంటే.. కామన్ పీపుల్‌కు పిచ్చెక్కిపోతుంది. టీవీని పగులగొట్టాలనిపిస్తుంది.
ఒకప్పుడు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఛానళ్లు నిషేధించారు. ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడకు వచ్చేసి షూట్ చేయడం... దాన్ని టెలికాస్ట్ చేయడంతో సినిమా రిలీజ్ నాటికి కొన్ని సీన్స్ చూశాక... ఇదేదో పాత సినిమా అన్నట్లు ప్రేక్షకులలో భావన రావడం జరిగింది. ఇది ఎప్పుడో చూశాం కదా... అని థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయింది. దాంతో కలెక్షన్లకు గండిపడింది. దీంతో ఛాంబర్ కళ్లు తెరిచి... ఛానళ్లను రానివ్వద్దని హుకుం జారీ చేసింది. అది ఓ వ్యక్తికి సంబంధించిన కాబట్టి కోట్ల వ్యాపారం కనుక దానిని అడిగే హక్కు ఛానల్‌కు లేదు. కానీ రాజకీయం అంటే ప్రతివారికీ లోకువే. ప్రజాస్వామ్యంలో మేం చెప్పే హక్కు ఉందని వితండవాదం చేస్తారు ఛానల్‌వారు.
అంతేకాదు... అసలు ఛానళ్లలో ఉన్న రాజకీయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య ఓ ఛానల్ అధిపతి సహఉద్యోగిని మోసం చేశాడు. అది బయటకు రాలేదు. అయినా ఆ అమ్మాయి వదలకపోవడంతో ఆమె శీలం మంచిది కాదనీ, బెదిరించడంతోపాటు మరో స్త్రీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన సంఘటనే. ఇదే బయట జరిగితే... 24 గంటలు ప్రసారాలు చేస్తూ ఉతికి ఆరేస్తారు. సదరు వ్యక్తి నీచుడు... ఛండాలుడు అంటూ నానా రభస చేస్తారు. కానీ సదరు ఛానల్ అధిపతిని ఆ అమ్మాయి తాలూకు బంధువు వదల్లేదు. అతడిపై కత్తితో మేకులతో దాడి చేసి కసి తీర్చుకున్నాడు. అది పోలీసు కేసు కావడంతో తప్పనిసరై ప్రసారం అయింది. ఇదే కాదు... ఎన్నో ఘటనలు... కేవలం బ్లాక్ మెయిల్ ఛానల్ అని ఒకదానికి పేరుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఛానళ్ల వికృత పోకడల దృష్ట్యా భవిష్యత్‌లో మీడియాపై విప్లవం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Saturday, January 23, 2010
ముగ్గురూ.. ముగ్గురే: ఇక తెలంగాణా ఏఁవత్తది!
నాన్నేమో.. హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు కోస్తాడట. అల్లుడేమో.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని శంషాబాద్ విమానాశ్రయంలో కాలుపెట్టనీయడట. కూతురేమో.. సమైక్యాంధ్ర వాదులు నిర్మించిన చిత్రాలను అడ్డుకుంటారట". గత కొన్ని రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు చేస్తున్న విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలే వీరి వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల బతుకులు ఏవిధంగా ఉంటాయో సినీ నటి విజయశాంతి నటించిన "ఒసేయ్.. రాములమ్మ" చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు మన దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు. అంతేకాదు.. సాక్షాత్ తెలంగాణ ప్రాంతానికే చెందిన విప్లవ హీరో ఆర్.నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించిన పలు చిత్రాల్లో తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులనే కథా నేపథ్యంగా తీసుకుని చూపించారు.అంటే.. తెలంగాణ దొరల చెప్పుచేతల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఏవిధమైన దుర్భర జీవితం గడిపారో ఈ చిత్రాల్లోని సన్నివేశాలే నిదర్శనం. ఇలాంటి ప్రజల బతుకులు బాగు చేసుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. అయితే, ఆ పార్టీకి చెందిన అధినేతతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు మరో ప్రాంతం వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి.హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు తెగ్గొస్తాం అని కేసీఆర్ అంటే.. ఆయన మేనల్లుడు హరీష్ రావు ఏకంగా.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని శంషాబాద్ విమానాశ్రయంలో అడుడుపెట్టనీయమని హెచ్చరించారు. ఇకపోతే.. కేసీఆర్ కుమార్తె కవిత మరో అడుగు ముందుకు వేశారు. కళలకు, కళాకారులకు ఎల్లలు లేవన్నది జగమెరిగిన సత్యం. మరి.. అలాంటి కళాకారులు నటించిన చిత్రాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు చేశారు.
అంటే.. వీరి డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా.. వీరి పాలన ఇలాగే కొనసాగుతుందా? అనే ధర్మసందేహం సామాన్య ప్రజానీకంలో ప్రస్తుతం ఉత్పన్నమైంది. అధికారం లేకపోయినా.. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినొస్తున్నాయి. ఇక.. నిజంగానే అధికార పగ్గాలు చేపడితే వీరి పాలన ఎలా ఉంటుందో వీరు చేస్తున్న వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయని పలువురు తెలంగాణ ప్రాంత వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారివల్లే అనుకున్న లక్ష్యం మధ్యలోనే నీరుగారి పోయే ప్రమాదం ఉందని ఉద్యమకారులను ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Subscribe to:
Posts (Atom)