మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన క్యారీకేచర్‌లు ప్రచురించినందుకు మొన్న.. ఫేస్‌బుక్, నిన్న.. యూ ట్యూబ్‌లపై నిషేధం విధించిన పాకిస్థాన్ సర్కారు నేడు (శుక్రవారం) ట్విట్టర్‌పై నిషేధిం విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ వెల్లడించింది. ఈ శాఖ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థలు ట్విట్టర్ సైట్‌ను బ్లాక్ చేశాయి. దీంతో పాకిస్థాన్ నెటిజన్లు యాక్సెస్ చేయలేక పోతున్నారు. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన నెటిజన్లు ట్విట్టర్ బ్లాగును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, ఈ 'సైటు నిషేధించబడింది' అనే సమాచారాన్ని వారు పొందుతున్నారు.
మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకరమైన సమాచారాన్ని, క్యారీకేచర్లను పొందుపరిచారంటూ గత రెండు రోజులుగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌తో పాటు.. వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూ ట్యూబ్‌లపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెల్సిందే. లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ ఈ తరహా చర్యలు చేపట్టింది.
దీనిపై పాకిస్థాన్ టెలీ కమ్యూనికేషన్ అథారీటీ అధికారులు స్పందిస్తూ.. అభ్యంతకర వీడియోలు, సమాచారం ఉండటంతో యూట్యూబ్‌ను నిషేధించినట్టు చెప్పారు. అయితే, ఎలాంటి సమాచారాన్ని పొందుపరిచిందో శాఖ వెల్లడించలేదు. ఇపుడు తాజాగా ట్విట్టర్‌పై కూడా ఇదే తరహా చర్య చేపట్టింది. అయితే, ఈ చర్యకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment