Thursday, December 24, 2009

Hyderabad Brand - Gone

తెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ప్రజల భావోద్వోగాలను ఆయా ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టిన ఫలితం బ్రాండ్ ఆంధ్రా.. బ్రాండ్ హైదరాబాద్ నేడు బూడిద కానుంది. ప్రపంచ చిత్ర పటంలో హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక ఖ్యాతి ఉంది.

ముంబయి తర్వాత అంతటి శక్తివంతమైన నగరం హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాదు. కానీ నేడు ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ బ్రాండ్ నిట్టనిలువునా కుప్పకూలుతోంది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థలు తమ కంపెనీలకు సంబంధించి కార్యాలయాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నెలకొల్పడానికి వచ్చి ఇక్కడి భీతావహు వాతావరణాన్ని చూసి వచ్చిన దారినే వెళ్లిపోయారు.

ఇలా హైదరాబాదు చేతి నుంచి జారిపోయిన కంపెనీల పెట్టుబడులు సుమారు 2 వేల కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఇక ఉద్యమాల ఫలితంగా రాష్ట్రానికి కేవలం వ్యాపార రంగంలో వచ్చిన నష్టం వేయి కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా రాష్ట్రం అభివృద్ధి పదేళ్లు కాదు.. వందేళ్లు వెనక్కి వెళ్లినట్లు కనబడుతోంది.

వెనకటికి ఓ ఆర్థికవేత్త చెప్పినట్లు ఏ దేశ లేదా రాష్ట్ర అభివృద్ధికి లేదా పతనాల వెనుక ఖచ్చితంగా ఓ ఉద్యమం దాగి ఉంటుందన్న సత్యం నేడు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. మనకు మనమే ఆంధ్రను అంధకారంలోకి నెట్టుకుంటున్నామా... అనే ప్రశ్న నేడు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది

No comments:

Post a Comment