రాజకీయ రంగంలో నిరుద్యోగం ఎక్కువై పదవులు లేనపుడే ఏదో ఒక రూపేణా కొన్ని ఉద్యమాలు పుట్టుక వస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఉద్యమాలను కేవలం వారు తమ పునరావాసం కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని అంటున్నారు. అటువంటి ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయంటున్నారు.
మన రాష్ట్రం సంగతినే తీసుకుంటే... ఒకప్పుడు చెన్నారెడ్డి రాజకీయ నిరుద్యోగంలో ఉండగా ఉద్యమాలు లేపి తెలంగాణా వాదాన్ని ముందుకు తెచ్చారు. ఆయనకు పదవులు ఇవ్వగానే ఆ ఉద్యమం చల్లారిపోయింది. అదే చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పడు వైఎస్ కొంతమందిని ఉసిగొల్పారని చెపుతున్నారు. నాటి అల్లర్లలో దాదాపు 350మంది విద్యార్థులు చనిపోయారు. మరి తెలంగాణా రావాలంటే అప్పుడే రావాలి కదా. ఎందుకు రాలేదంటే.. అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే కనిపిస్తుందంటున్నారు.
ఆ తర్వాత మల్లిఖార్జునరావు, అంజయ్యలకు పదవులు వచ్చాయి. తర్వాత వెంకటస్వామికి సైతం పదవి దక్కింది. వీరంతా 30 ఏళ్లుగా ఎందు ఉద్యమాలు చేయకుండా మిన్నకున్నారు...? అంటే.. తమకు రాజకీయంగా పదవులు లభించినపుడు వారంతా నిశ్శబ్దాన్ని పాటించినట్లు అవగతమవుతుంది.
ఇక ఇటీవల వెంకటస్వామికి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం వల్లనే ప్రత్యేక తెలంగాణా అంటూ ముందుకు వచ్చారని అంటున్నారు. అలాగే జీవన్ రెడ్డి, కేసీఆర్‌లకు అప్పడు తెలంగాణా ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా నిరుద్యోగంతో బాధపడుతూ... పదవీవ్యామోహంతో ప్రజలతో ఆడుకుంటున్న చదరంగం తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఇవన్నీ సామాన్యుడికి అవసరం లేదు. వారికి నిత్యావసర సరుకులు కావాలి. కందిపప్పు, బియ్యం, మంచినీళ్లు కావాలి... అంటారే తప్పించి రాష్ట్ర విడిపోనిదే మాకు ముద్ద దిగదు అని ఎవ్వరూ అనరు. ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం దాదాపు శూన్యంగానే అనుకోవచ్చు.
ఈ నేపధ్యంలో నేరుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు గల మార్గాలను అన్వేషించి, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. లేదంటే మొత్తంగా అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికలు నిర్వహించి తెలంగాణాపై రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఎటువంటి తీర్పు చెపుతారో దానిప్రకారం నడుచుకుంటే ఎటువంటి గొడవా ఉండదని చెపుతున్నారు
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలు యెవరికి కావాలి ఇది నాయకుల ఫ్యూచర్ కోసం పోరాటం..నో డౌట్...యే రాష్ట్రమయిన కామన్ పీపుల్ కి వొరిగేది యేమీ వుండదు..హైదరాబాద్ ఎలెక్షున్స్లో యెప్పుడు అయితే నిలబడే దైర్యం లేదో ..రాజకీయ భవిష్యత్ మూసుకు పొతున్నదన్న బెంగతో ఈ రెచ్చ గొట్టుడు పనికి కేసిఆర్ పాల్పడ్డాడు ...జిన్నా మాదిరిగా జీవితాంతంలో కేసిఆర్ పాశ్చాతప్ప పడక తప్పదు కానీ యేమి చేయగలమ్ అప్పటికే విబజన తాలూకా ఫలితాలు అందరం అనుబవించక తప్పదు
ReplyDelete