Saturday, January 2, 2010

ఆంధ్రప్రదేశ్‌‌ను పీడిస్తున్న ఆందోళనల భూతం

గత నెలరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు రాష్ట్రాన్ని ఆందోళనల భూతం పట్టి పీడిస్తోందా... అనిపిస్తుంది. మొత్తమ్మీద ఈ సుడిలో సామాన్యుని జీవితం దుర్భరమైపోతుంది. రాష్ట్రంలోని రవాణా దాదాపు స్తంభించిపోయిందనే చెప్పాలి. దీంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్రంలో బంద్‌లు, ఆందోళనల వల్ల కలిగిన నష్టం అపారమైనదిగా, మాంద్యం తెచ్చిన నష్టాన్ని సైతం అధిగమించి రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలను చైతన్యపరిచి ఆందోళనలను విరమింప చేయాల్సిన నాయకులే వాటిని ఎగదోసే రీతిలో ప్రవర్తించడం విచారకరమని వారు అంటున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రజా వనరులతో పనిచేస్తున్న పరిశ్రమలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఉన్న ఆర్డర్లను సమయానికి అందించకపోవడంతో రావాల్సిన పనులు చేతికి రావడం లేదు. మొత్తమ్మీద సగటు ఉద్యోగి బితుకుబితుకుమని కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగికి ఢోకా లేకపోయినా ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్ డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

1 comment:

  1. నాయకులు యెగదోయడం కాదు ఇది వారికి జీవన్మరణ సమస్య ..రాజకీయ జీవితాలు అంతరించి పోకుండా ప్రజల జీవితాలతో జూదం ఆడుతున్నారు..వొట్ల కోసం వీళ్లు యేలా యగధోస్తున్నారో ఈ ప్రజలు యెందుకు అర్దం చేసుకోరూ?వొట్లకు గేలమ్ యలా వెయ్యాల అని వొకడు మరాఠీ కార్డ్ తీస్తాడు మహారాస్త్ర మరాతీలదే అంటాడు వీడికి వొట్ బాంక్ క్రియేట్ చేస్కోవడమే టార్గెట్ తప్పితే యలాంటి పరిణామాలు ప్రజలు యెదుర్కోవలసి వస్తుంది అన్నది అనవసరం ..రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం వీళ్ళు ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తున్నే వుంటారు

    ReplyDelete