Monday, January 11, 2010

అందరు ఒక సరి ఆలోచించండి

ఎవరి ఇష్టం వోచినట్టు వాళ్ళు మాట్లాడుకునే హక్కు అందరికి ఉంది. అంతే కానీ తెలంగాణా కి సపోర్ట్ ఇవ్వక పొతే సినిమా అడనివ్వం, పండుగకి ఇంటికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి రానివ్వం అనడం సరికాదు. ఉద్యమం చేయడానికి ఒక పద్దతి ఉండాలి అంతే కానీ బుసలు తగుల బెట్టి, సినమా లు ఆపేసి గొడవ చేస్తే తెలంగాణా వస్తుంది అనుకుంటే బ్రమే అవుతుంది. ఉద్యమం అంటే హింస కాదు, హింసే మార్గం అనుకుంటే అనుకున్న పని ఎప్పటికి కద్దు. హింస వాళ్ళ జరిగే నష్టానికి మరల మనమే బాద్యత వహించాలిసి వస్తుంది.

ఉద్యమం చేసుకునే హక్కు అందరిది కాని అది చేసే విదానం మారాలి. కొట్టి, బెదిరించి చేసే ఉద్యమానికి శాశ్విత పరిష్కారం ఉండదు. బలం సంపాదించడం అంటే బయపెట్టడం కాదు. ముందు మనం చేసిది తప్పు కాదో తెలుసుకోవాలి. జనం అంట చూస్తున్నారు, మనం ఏది చేసిన చెల్లు అనుకుంటే తప్పు.

ఉద్యమం చేయండి అది ఎవరినో బయ పెట్టడానికో, ఏదో నష్ట పరచాదనికో మాత్రం అయితే మాత్రం వొద్దు. అలా చేసిన ఉద్యమానికి ఏమి కాదు ఏమి రాదు. పండుగ నాడు అందరి ఆనందం కోసం వచ్చే సినిమా ని ఆపడం గొడవ చేయటం దానికి ఏదో కారణం చెప్పడం అవివేకం. కుటుంబం లో అందరు ఒకే పార్టీ కి ఒకే ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాలి అనడం లేక పొతే బెదిరించడం మన సంస్కృతీ కాదు. అందరం పండుగని బాగా జరుపుకుందాం. మన వినోదం కోసం కోట్లు పెట్టి తీసిన సినిమా ని ఈ చిల్లర రాజకియ్యాల కోసం బలి చేయడం ఎంత వరకు బావ్యం?

తెలంగాణా రాకుండానే నాలుకలు కోసేస్తం, ఎయిర్ పోర్టులో దిగనియ్యం, సినిమాలు కొనొద్దు అంటే ఇక తెలంగాణా వస్తే? అందరు ఒక సరి ఆలోచించండి






No comments:

Post a Comment